అధికారిక వెబ్‌సైట్లు వినియోగించుకోండి
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:57 PM
శ్రీశైల దేవస్థాన దర్శనార్థం వచ్చే యాత్రికులు స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శన టికెట్లు పొందుటకు కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లతో పాటు మనమిత్ర వంటి ఆన్‌లైన్ సేవలను వినియో గించుకోవాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.
శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థాన దర్శనార్థం వచ్చే యాత్రికులు స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శన టికెట్లు పొందుటకు కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లతో పాటు మనమిత్ర వంటి ఆన్‌లైన్ సేవలను వినియో గించుకోవాలని ఈవో శ్రీనివాసరావు కోరారు. బుధవారం ఆలయ ప్రధాన విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్శన విధానాల అమలు, క్షేత్ర పవిత్రత కోసం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న ఆర్జిత సేవలతో పాటు అతిశీఘ్ర, శీఘ్ర దర్శనాల టిక్కెట్లు వంటి 14 విధాలైన ఆర్జితసేవలు ఆన్‌లైన్‌లో ప్రతినిత్యం అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాట్సప్ గవర్నెన్స్ 95523 00009 నంబరుకు భక్తుల రిజిస్టర్డ్ నంబరు నుంచి పూర్తి వివరాలను పొందవచ్చునన్నారు. టికెట్లు పొందిన భక్తులు తప్పనిసరిగా ఆధార్ కాపీలు తీసుకుని నిర్ణీత సమయానికి మాత్రమే ప్రవేశ ద్వారాల వద్దకు చేరుకోవాలని భక్తులను కోరారు. టోల్‌గేట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ఆలయ భద్రతా అధికారికి కీలక సూచనలు చేశారు.