Share News

మార్షల్‌ ఆర్ట్స్‌ను సాధన చేయాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:51 PM

ఆత్మరక్షణకు పత్రి విద్యార్థి మార్షల్‌ ఆర్ట్స్‌ను సాధన చేయాలని మార్కెట్‌ యార్డు మాజీ చైర్‌పర్సన్‌ ఎన్‌.శమంతకమణి అన్నారు.

మార్షల్‌ ఆర్ట్స్‌ను సాధన చేయాలి
తైక్వాండో క్రీడను ప్రారంభిస్తున్న అతిథులు

కర్నూలు స్పోర్ట్స్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆత్మరక్షణకు పత్రి విద్యార్థి మార్షల్‌ ఆర్ట్స్‌ను సాధన చేయాలని మార్కెట్‌ యార్డు మాజీ చైర్‌పర్సన్‌ ఎన్‌.శమంతకమణి అన్నారు. ఆదివారం స్థానిక కిడ్స్‌ వరల్డ్‌ పార్కులో తైక్వాండో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పరికరాలు, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఎల్లో, గ్రీన్‌ బెల్టులు అందజేశారు. స్పోర్ట్స్‌ అథారిటీలో ఉన్న క్రీడలని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవా లన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచిం చారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆత్మరక్షణకు బాక్సింగ్‌, తైక్వాండో, జూడో క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని కోరారు. వగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్‌ ట్రస్టు వారు బెల్టులను అందించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో సీనియర్‌ శిక్షకుడు టి.వెంకటేశ్వర్లు, కోచ్‌ టి.అజయ్‌, బాక్సింగ్‌ కోచ్‌ ఆర్‌.మదు కుమార్‌ జూడో కోచ్‌ కే.నవీన్‌, లలిత, టి.తిలక్‌, అఖిల్‌, సాయిక్రిష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:51 PM