Share News

డిజిటల్‌ బోధనను వినియోగించుకోండి

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:30 PM

విద్యార్థులు డిజిటల్‌ బోధనను సద్వినియోగించు కోవాలని ఆర్జేడీ శామ్యూల్‌ అన్నారు.

డిజిటల్‌ బోధనను వినియోగించుకోండి
కాల్వబుగ్గ ఏపీఆర్‌ గురుకుల పాఠశాలలో ట్యాబ్‌లను పరిశీలిస్తున్న ఆర్జేడీ శామ్యూల్‌

ఆర్జేడీ శామ్యూల్‌

ఓర్వకల్లు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు డిజిటల్‌ బోధనను సద్వినియోగించు కోవాలని ఆర్జేడీ శామ్యూల్‌ అన్నారు. గురువారం మండలంలోని కస్తూర్బా, మోడల్‌ స్కూల్‌, ఏపీఆర్‌ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ డిజిటల్‌ బోధన కోసం ఒక్కొక్క పాఠశాలకు ట్యాబ్‌లను అందజేశామన్నారు. ఇప్పటికే డిజిటల్‌ విద్యపై విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు వీడియో పాఠాలను విన్న తర్వాత వాటిపై కొన్నిప్రశ్నలు ఉంటాయనీ, వాటిని జవా బు రాయడం ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక ప్లాట్‌ఫాం సా యంతో ఇన్‌ఫోసి్‌స బృందం ట్యాబ్‌ల వినియోగాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. నెలవారి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుందన్నారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇన్‌ఫో సిస్‌ సంస్థ ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో పాటు అప్రెంటిషిప్‌ అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డీఈవో శామ్యూల్‌పాల్‌, ఎంఈవో ఓంకార్‌ యాద్‌, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:30 PM