Share News

ఉరుకుంద దేవస్థానం హుండీ లెక్కింపు

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:24 PM

ఉరుకుంద ఈరన్న స్వామి దేవ స్థానం హుండీని శుక్రవారం లెక్కించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈవో విజయరాజు తెలిపారు.

ఉరుకుంద దేవస్థానం హుండీ లెక్కింపు
హుండీ లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది

రూ.1.22 కోట్లు ఆదాయం

ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు

కౌతాళం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఉరుకుంద ఈరన్న స్వామి దేవ స్థానం హుండీని శుక్రవారం లెక్కించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈవో విజయరాజు తెలిపారు. శ్రావణమాసం మొదటి సోమవారం నుం చి గురువారం వరకు భక్తులు సమర్పించిన కానుకలను దేవస్థానపు కాలక్షేప మండపంలో లెక్కించారు. నగదు రూపంలో రూ.1,22,88,424, బంగారం 34 గ్రాములు, 600మిల్లి గ్రాములు, వెండి 23కిలోల 230 గ్రా ములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేష్‌, ఆదోని గ్రూపు ఆలయ పర్యవేక్షులు, ఆలయ అధికారులు మల్లికార్జున, వెంకటేశ్వరరావు, దేవాలయపు ఉప ప్రధాన అర్చకుడు మహదేవప్ప, అర్చకులు నాగరాజు స్వామి, శివన్న స్వామి, ఇండియన్‌ బ్యాంకు సిబ్బంది, అర్చకులు, దేవస్థానపు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 11:25 PM