Share News

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1. 37 కోట్లు

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:50 PM

మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవ స్థానం కాలక్షేపపు మండపంలో శుక్ర వారం ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈ ఓ వాణి ఆధ్వర్యంలో లెక్కించారు.

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1. 37 కోట్లు
హుండీ లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది

కౌతాళం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవ స్థానం కాలక్షేపపు మండపంలో శుక్ర వారం ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈ ఓ వాణి ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తు లు స్వామి వారికి సమర్పించిన కాను కల్లో నగదు రూ.1,37,79,215, బంగారం 6.74 గ్రాములు, వెండి 18. 990 కిలోలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేష్‌, ఆదోని గ్రూపు ఆలయ పర్యవేక్షులు, ఆలయ అధికారులు మల్లికార్జున, వెంక టేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:50 PM