నంద్యాల ఈఎస్‌ఐని అప్‌గ్రేడ్ చేయండి
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:51 PM
నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ మంగళవారం కేంద్ర శ్రమ, ఉపాధి మంత్రి మాన్‌సున్ మాండవీయను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.

నంద్యాల హాస్పిటల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ మంగళవారం కేంద్ర శ్రమ, ఉపాధి మంత్రి మాన్‌సున్ మాండవీయను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 3.75 లక్షల మంది కార్మికులు ఉన్నారని, వీరిలో చాలా మంది నిర్మాణ, వ్యవసాయ, తయారీ పరిశ్రమలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నంద్యాలలో ఒక ఈఎస్‌ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉందని, ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. దీనివల్ల వేలాది మంది కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యసేవలు, అత్యవసర చికిత్సలు అందుబాటులోకి వస్తాయని మంత్రికి వివరించారు.