Share News

రాఘవేంద్రుని సన్నిధిలో ఉపేంద్ర

ABN , Publish Date - May 11 , 2025 | 10:59 PM

మంత్రాలయం రాఘవేంద్రస్వామిని తెలుగు, కన్నడ సినీనటుడు ఉపేంద్ర ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

రాఘవేంద్రుని సన్నిధిలో ఉపేంద్ర
పీఠాధిపతి నుంచి జ్ఞాపిక అందుకుంటున్న నటుడు ఉపేంద్ర

మంత్రాలయం, మే 11 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామిని తెలుగు, కన్నడ సినీనటుడు ఉపేంద్ర ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు కన్నడ సినీనటి తార కూడా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనా ర్థం వచ్చిన వీరికి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రాఘవేంద్రస్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫలఫుష్ప మంత్రాక్షింతలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్‌ జోషీ, సురేష్‌ కోనాపూర్‌, అనంతపురాణిక్‌, శ్రీపతాచార్‌, ఐపి నరసింహమూర్తి, రవి కులకర్ణి, ద్వారపాలక అనంతస్వామి, పవనాచార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 10:59 PM