కేంద్రం నియంత్రణలోకి ‘ఉపాధి’
ABN , Publish Date - May 15 , 2025 | 11:54 PM
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉపాధి హామీ పనులు సాగాయి. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ తమ ఆధీనంలో ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇక నామమాత్రంగానే ఉండబోతోందని ఈ పథకాన్ని అమలు చేస్తున్న నీటి యజమాన్య సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
యుక్తధార యాప్ అమలులోకి
ప్రతి పనిని నమోదు చేయాలని ఆదేశాలు
పనులూ, చెల్లింపులు అన్నీ ఢిల్లీ నుంచే
కర్నూలు అగ్రికల్చర్, మే 15(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉపాధి హామీ పనులు సాగాయి. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ తమ ఆధీనంలో ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇక నామమాత్రంగానే ఉండబోతోందని ఈ పథకాన్ని అమలు చేస్తున్న నీటి యజమాన్య సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునేందుకు కేంద్రం ‘యుక్తధార’ అనే యాప్‌ను రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించేందుకు 2005లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా పనులు కల్పించేలా చేసింది. ఏపీవో, ఎంపీడీవోలు పర్యవేక్షించేవారు. పనుల కల్పన, బిల్లుల చెల్లింపులు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగేవి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘యుక్తధార’ యాప్ ద్వారా ఇప్పటి దాకా ఈ పథకంలో జరుగుతున్న ప్రాసెస్ కనుమరుగయ్యే అవకాశముంది.
యాప్ అమలు తీరు ఇలా..
కేంద్ర ప్రభుత్వం ‘యుక్తధార’ యాప్‌ను తీసుకువ చ్చింది. ఎక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో ఏప్రాంతంలో ఏ పని ఎప్పుడు చేయాలో అంచనాలు ఎలా వేయాలి, బిల్లుల చెల్లింపులు ఎలా జరగాలనే అంశాలన్నింటినీ ఈ యాప్ ద్వారా ఢిల్లీలో కూర్చుని కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించనున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అవసరమైన లేబర్ బడ్జెట్ ఆమోదం తెలుపుతుంది. కూలీలు చేయాల్సిన పనులన్నీ కేంద్రమే గుర్తిస్తుంది. వారికి డబ్బులు నేరుగా కేంద్రమే వారి అకౌంట్లకు జమ చేస్తుంది. ఇప్పటికే ‘యుక్తధార’యాప్ విని యోగంలో ఉందని, తొలి దశగా జిల్లా వ్యాప్తంగా మండలా నికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసు కుని అమలు చేస్తున్నట్లు కర్నూలు నీటి యజమాన్య సంస్థ పీడీ వెంకటర మణ తెలిపారు. రెండో దశలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.