రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:13 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం కేంద్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాదజోషి కుటుంబ సమేతంగా రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు.
ప్రహ్లాదజోషికి స్వాగతం పలికిన ఎంపీ, కలెక్టర్, ఎస్పీ
మంత్రాలయం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం కేంద్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాదజోషి కుటుంబ సమేతంగా రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. అలాగే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి మంత్రాలయానికి చేరుకుని పద్మనాభతీర్థ అతిథి గృహంలో బస చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఆలయ ముఖద్వారం వద్ద మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషీ సురేష్ కోనాపూర్, శ్రీపతాచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని హారతులు ఇచ్చారు. రాఘవేంద్రస్వామి మూల బృంధావనానికి విశేష పూజలు చేసి ప్రహ్లాదరాయల పాదపూజలో పాల్గొని తరించారు. సాయంత్రం కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాత్రి రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు రాఘవేంద్రస్వామి మెమెంటో, పట్టువస్త్రం ఫలపుష్ఫ మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి కేంద్రమంత్రిని సత్కరించారు. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు కిశోర్‌కుమార్, సభ్యుడు నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రాయచూర్ కలెక్టర్ నితీశ్, ఎస్పీ పుట్ట మాదయ్య, ట్రాన్స్‌కో సీఎండీ సంతో్‌షరావు, ఎస్‌ఈ ఉమాపతి, డీఈ పురుషోత్తం, ఏఈ గోవిందు, జిల్లా ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రాజగోపాల్, టీడీపీ నాయకులు మద్దిలేటి, చంద్రశేఖర్, కేంద్ర ఇండిపెండెంట్ డైరెక్టర్ గిరీష్ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్ ఎస్.రవి, నార్త్ జోన్ శ్రీమఠం విచారణకర్త శ్రీనివాస కస్బే ఉన్నారు.