ప్రభుత్వ క్వార్టర్స్‌లో అనధికార వ్యక్తుల నివాసం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:37 AM
నగరంలోని ఏ, బీ, సీ క్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో కొన్నేళ్లుగా అనధికార వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకున్నారని లంబాడీ సంఘం జాతీయ కార్యదర్శి యోగేష్ నాయక్ ఆరోపించారు
లంబాడీ సంఘం జాతీయ కార్యదర్శి యోగేష్‌నాయక్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏ, బీ, సీ క్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో కొన్నేళ్లుగా అనధికార వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకున్నారని లంబాడీ సంఘం జాతీయ కార్యదర్శి యోగేష్ నాయక్ ఆరోపించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ రంజితబాషాకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాటా ్లడుతూ క్వార్టర్స్‌ను కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కేటాయించాలని కోరారు. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు నుంచి ఐదు క్వార్టర్స్ వరకు రెవెన్యూ అధికారులు కేటాయించారని విమర్శించారు. నిబంధనల మేరకు ఒక ప్రభు త్వ ఉద్యోగికి ఒక క్వార్టర్స్‌ను మాత్రమే కేటాయించాలన్నారు. ఒక ఉద్యోగి నాలుగైదు క్వార్టర్స్ తీసుకోవడంతో మిగతా ప్రభుత్వ ఉద్యోగులు అర్హత కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వ క్వార్టర్స్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిని తొలగించి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేయాలన్నారు.
- నగరంలోని ఉల్చాల రోడ్డు నుంచి పెద్దపాడు వరకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు పుల్లారెడ్డి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం నుంచి కోడుమూరు, పత్తికొండ, బళ్లారి, ఆదోని మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాలకు వెళ్లే దారిలో ఉల్చాల రోడ్డు నుంచి పెద్దపాడు వరకు రోడ్డు మార్గాన వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వినతిలో పేర్కొన్నారు.
-రాష్ట్రంలో మత్స్యకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోస అప్పలరాజు అన్నారు. మత్స్య కారుల సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ వినతిపత్రం సమర్పిం చారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, సాయిప్రదీప్, ముని, చేపల రమేష్, వెంకటేశ్వర్లు, మద్దికెర సిద్దప్ప, ఉయ్యాలవాడ శ్యాం, పవన పాల్గొన్నారు.
- నగరంలో టౌన మోడల్ కళాశాలలో తాగునీటి, మరుగుదొడ్ల సదుపాయాలు, క్రీడా మైదానాన్ని పునరుద్ధరించాలంటూ భీమ్ ఆర్మీ రాష్ట్ర కన్వీనర్ విజయభాస్కర్ కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.
- ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీల అవసరాల నిమిత్తం బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణానికి కేటాయించిన 1.60 ఎకరాల స్థలాన్ని శుభ్రం చేసి ఎస్సీలకు అప్పగించాలని బహుజన సివిల్ రైట్స్ ఫోరమ్ నాయకులు దిలీప్ కుమార్, మహేష్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
-2019-20లో ఎమ్మిగనూరు పట్టణంలో కరోనా రోగులకు మూడు పూటల ఆహారాన్ని మా సంస్థ వేదాస్ (విలేజ్ ఎడ్యుకేషన అండ్ డెవల ప్మెంట్ యాక్షన సొసైటీ) ద్వారా అందించామని, అందుకుగానూ రూ.12.50 లక్షలు టూరిజం శాఖ ద్వారా బిల్లులు రావాల్సి ఉందని వేదాస్ ప్రెసిడెంట్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.