ఎమ్మెల్యే అఖిలప్రియకు అస్వస్థత
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:03 AM
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని డబ్ల్యూ. గోవిందిన్నె గ్రామంలోని మూలపెద్దమ్మ దేవరలో ఎమ్మెల్యే అఖిలప్రియ, భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి సోమవారం పాల్గొన్నారు.

దొర్నిపాడు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని డబ్ల్యూ. గోవిందిన్నె గ్రామంలోని మూలపెద్దమ్మ దేవరలో ఎమ్మెల్యే అఖిలప్రియ, భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఉదయం నుంచి ఉపవాసదీక్షలు ఉండి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గండాదీపం మోశారు. ఉన్నఫలంగా స్పృహ కోల్పోవడంతో భర్త, సోదరుడు హుటాహుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యాధికారి సుజాత వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం నంద్యాల ఎన్‌ఐటీసీ ఆసుపత్రికి తరలివెళ్లారు. ఎమ్మెల్యే స్పృహ కోల్పోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు.