Share News

అంతా మా ఇష్టం..!

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:32 AM

నగరంలో సి.క్యాంపు రైతుబజార్‌లో దళారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కొంతకాలం పాటు రైతులు, పొదుపు మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగి, రైతులకు ప్రాధాన్యం తగ్గిపోయింది.

అంతా మా ఇష్టం..!
రైతుబజార్‌ రెండో గేటువైపు అడ్డంగా నిర్మించిన దుకాణం

సి. క్యాంపు రైతు బజార్‌లో అడ్డదిడ్డంగా దుకాణాల నిర్మాణం

చోద్యం చూస్తున్న అధికారులు

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 19ఆంధ్రజ్యోతి): నగరంలో సి.క్యాంపు రైతుబజార్‌లో దళారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కొంతకాలం పాటు రైతులు, పొదుపు మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగి, రైతులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే కొనసాగుతోంది. కనీసం నిలిచేంఆదుకు కూడా స్థలం లేక వినియోగదారులు ఇబ్బంది పడుతుంటే అడ్డ దిడ్డంగా దుకాణాలు నిర్మించేస్తున్నారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిబంధనల ప్రకారమే దుకాణాలు

సి.క్యాంపు రైతుబజారులో మార్కెటింగ్‌ శాఖ అధికారుల సూచనల మేరకే దుకాణా లను నిర్మిస్తున్నాం. రైతుబజార్‌ లేఅవుట్‌ ప్రకారమే దుకాణాలను నిర్మించాం. వాటిని ఎవరికి కేటాయించాలన్నది మా పరిధిలో లేదు. ఆ వ్యవహారాలన్నీ సంబంధిత అధికారులే చూస్తున్నారు. - రఘునాథరెడ్డి, డీఈఈ, మార్కెటింగ్‌ శాఖ, కర్నూలు.

Updated Date - Nov 20 , 2025 | 12:32 AM