Share News

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ABN , Publish Date - May 01 , 2025 | 11:46 PM

నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో పాత కక్షలు మనసులో ఉంచుకుని చేసిన హత్యపై నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులైన నగేష్‌, నాయకంటి బాలమద్దికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ న్యాయాధికారి జి.కబర్ది గురువారం తీర్పు చెప్పారు.

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
యావజ్జీవ శిక్ష పడిన ఇద్దరు నిందితులు

కర్నూలు లీగల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో పాత కక్షలు మనసులో ఉంచుకుని చేసిన హత్యపై నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులైన నగేష్‌, నాయకంటి బాలమద్దికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ న్యాయాధికారి జి.కబర్ది గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. డోన్‌ మండలం ఎస్‌.గుండాల గ్రామానికి చెందిన హతుడు బోయ గుమిడిరాళ్ల కౌలుట్ల గ్రామపెద్దగా పనిచేసి గ్రామంలో పేరు గడిం చారు. 2016లో మే 15న హతుడు తన స్వగ్రామం నుంచి డోన్‌కు పనిమీద వచ్చాడు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ కాలు వలో కౌలుట్ల మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హతుడి కుమా రుడు కాంతారావుకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. దీంతో హతుడి కుమారుడు, కుటుంబ సభ్యులు డోన్‌ వెళ్లి హతుడిని గుర్తించి డోన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఆ తర్వాత డోన్‌ మండలం కొట్రాయి గ్రామానికి చెం దిన మాదిగ నగేష్‌, గుమ్మకొండ గ్రామానికి చెందిన నాయకంటి బాలమద్దిలపై కేసును విచారించి వీరే కౌలుట్లను హత్యచేశారని నిర్ధారించారు. గ్రామంలో కౌలుట్ల ఎదుగుదలను ఓర్చుకోలేక నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు డోన్‌ పోలీసులు తమ విచారణలో కనుగొని కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.వెంకటరెడ్డి వాదించారు.

పోలీసులను అభినందించిన నంద్యాల ఎస్పీ

కౌలుట్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తులోనూ, సాక్ష్యాలు సేకరించడంలోనూ, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి నిందితులపై శిక్షపడేలా కృషిచేసిన పోలీసు అధికారులను నంద్యాల ఎస్పీ ఆదిరాజ్‌ సింగ్‌ రాణా అభినందించారు. పోలీసులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కృషి చేసినందుకు డోన్‌ డీఎస్పీ శ్రీనివాసులు, విచారణాధికారి, జిల్లా కోర్టు పీపీ ఎం.వెంకటరెడ్డిని అభినందించారు.

Updated Date - May 01 , 2025 | 11:46 PM