నిండు జీవితానికి రెండు చుక్కలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:02 AM
చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలా ముఖ్యమంత్రి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె/ నంద్యాల హస్పిటల్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలా ముఖ్యమంత్రి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని ప్రియదర్శిని పాఠశాలలో పల్స్‌పోలియో కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి చిన్నారులకు పల్స్‌పోలియో వేశారు. మంత్రి బీసీ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరూ పల్స్‌పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. సమాజం నుంచి పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణం నూనెలపల్లి ప్రాంతంలోని ఠాగూర్ మున్సిపల్ పాఠశాలలో కలెక్టర్ రాజకుమారి చిన్నారులకు పల్స్ పోలియో వేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.