Share News

మృతులకు నివాళి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:34 AM

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారికి గురువారం రాత్రి ఆలూరులో కొవ్వొత్తులతో రాల్యీ నిర్వహించి నివాళి అర్పించారు.

మృతులకు నివాళి
వెల్దుర్తి పాత బస్టాండ్‌లో నివాళి అర్పిస్తున్న నాయకులు, ప్రజలు

ఆలూరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారికి గురువారం రాత్రి ఆలూరులో కొవ్వొత్తులతో రాల్యీ నిర్వహించి నివాళి అర్పించారు. సాయిబాబా, బెలుగుండు ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస రెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, రంజిత్‌, నాగరాజు మాట్లాడుతూ పర్యాటకులపై తీవ్రవాదుల దాడి దురాహంకార చర్యగా ఖండిస్తున్నాయన్నారు. పునరావృతం కాకుండా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు గౌడ్‌, సిద్దలింగయ్య స్వామి, లోకన్న గౌడ్‌ పాల్గొన్నారు.

వెల్దుర్తి: జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి పాతబస్టాండ్‌ తెలుగుతల్లి కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

మద్దికెర: కశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడుల కాల్పుల్లో మృతులకు గురువారం రాత్రి మద్దికెరలో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు.

Updated Date - Apr 25 , 2025 | 12:34 AM