Share News

కూటమి ప్రభుత్వంతోనే గిరిజనుల అభివృద్ధి

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:10 AM

కూటమి ప్రభుత్వంతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వెంకటప్ప అన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే గిరిజనుల అభివృద్ధి
వెంకటప్పను సన్మానిస్తున్న ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, జయసూర్య

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వెంకటప్ప

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వెంకటప్ప అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని గిరిజన సంక్షేమ భవన్‌లో జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యులు వెంకటప్ప సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, గిత్తా జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 16 సంక్షేమ పథకాలు రద్దు చేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సాధికారిత అధికారి సురేష్‌, టీఎ్‌సఎఫ్‌ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు అక్కులప్ప నాయక్‌, రాగిరి చంద్రప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు నాయక్‌, నాయకులు రవీంద్ర నాయక్‌, కైలాష్‌ నాయక్‌, జేమ్స్‌, యోగేష్‌, రమణ, తెలుగు యువత గోపినాథ్‌, రామరాజు, వెంకటేశులు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:10 AM