ఏటీఎస్‌ను తనిఖీ చేసిన రవాణాశాఖ కార్యదర్శి
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:36 PM
నంద్యాల పట్టణంలో శివశంకర్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే శుక్రవారం సందర్శించారు.

నంద్యాల క్రైం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలో శివశంకర్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీఎస్ సెంటర్‌లోని పరికరాలను, వాటి పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం టెస్టింగ్ స్టేషన్ ఆపరేటర్ ఎం.విరు పాక్షిరెడ్డి, నాగార్జునరెడ్డి ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానాన్ని కాంతిలాల్ దండేకు విశ్లేషణాత్మకంగా వివరించారు. వాహన ఫిట్‌నెస్ పరీక్షలు ఆటోమేటెడ్ సిస్టం ద్వారా ఎలా నిర్వహిస్తారన్నది ప్రయోగాత్మకంగా చేసి చూపారు. పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను ఎలా నిర్ధారిస్తారు, టెస్టింగ్ సమయంలో వేగం, బ్రేకింగ్, ఎమిషన్, స్టీరింగ్, సస్పెన్షన్ తదితర అంశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా విశ్లేషించవచ్చో కార్యదర్శికి డెమో ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి వై.ఐశ్వర్యారెడ్డి, ఎంవీఐ తిమ్మరుసునా యుడు, స్థానిక ప్రాంతీయ రవాణా అధికారులు, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ సిబ్బంది పాల్గొ న్నారు. కాగా రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండేను కలెక్టర్ రాజకుమారి, జేసీ విష్ణుచరణ్ కలిశారు.