ఆర్‌అండ్‌బీ శాఖలో బదిలీలు
ABN , Publish Date - May 29 , 2025 | 11:27 PM
: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ హోదాల్లోని ఉద్యోగులకు బదిలీలు జరిగాయి.
కర్నూలు అర్బన్, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ హోదాల్లోని ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. గురువారం ఉదయం కర్నూలులోని ఎస్‌ఈ కార్యాలయంలో కర్నూలు సర్కిల్, అనంతపురం నేషనల్ హైవేకు సంబంధించి నాన్ టెక్నికల్ సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, నేషనల్ హైవే ఎస్‌ఈ హరిప్రసాద్, నంద్యాల ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీరు శ్రీధర్‌రెడ్డి, కర్నూలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరిగాయి. సూపరిం టెండెట్లు, సీనియర్ టెక్నికల్, అసిస్టెంట్ ఆఫీసర్స్, వర్క్ ఇన్స్‌పెక్టర్లకు బదిలీలు జరిగాయి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల బదిలీలను పారద ర్శకం గా నిర్వహించినట్లు ఆర్‌అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.