Share News

సమగ్ర శిక్షలో బదిలీ షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:43 PM

జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని కాంట్రా క్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ బి. శ్రీనివాసరావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

సమగ్ర శిక్షలో బదిలీ షెడ్యూల్‌ విడుదల

మ్యూచువల్స్‌కు మాత్రమే అవకాశం

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆలూరు, జూన్‌18(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని కాంట్రా క్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ బి. శ్రీనివాసరావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాలో ఉన్న కేజీబీవీ, ఎంఆర్‌సీ కేంద్రాలు, భవిత భవన్‌, మోడల్‌ హాస్టల్స్‌లో విధులు నిర్వహించే సిబ్బంది మ్యూచు వల్‌ బదిలీలకు మాత్రమే అవకాశం కల్పించారు. కేజీబీవీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, సీఆర్‌ఎంటీ, మండల స్థాయి అకౌంటెంట్లు, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీసు సబార్డినేట్లు, సైట్‌ ఇంజనీర్లకు అవకాశం కల్పించారు. ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 23న సీనియారిటీ జాబితా తయారు చేసి 24న ప్రకటిస్తారు. 27న అభ్యంతరాలు స్వీకరి స్తారు. 28న తుది జాబితా ప్రకటి స్తారు. 30 నుంచి జూలై 2వ తేదీ మధ్య బదిలీల ఉత్తర్వులిస్తారు.

Updated Date - Jun 18 , 2025 | 11:43 PM