Share News

బదిలీ నిబంధనలు సడలించాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:14 AM

చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు సొంత మండలం లో పోస్టింగ్‌ ఇవ్వరాదన్న నిబంధనను సడలించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

బదిలీ నిబంధనలు సడలించాలి
కొలిమిగుండ్లలో ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

కొలిమిగుండ్ల, జూన 24(ఆంధ్రజ్యోతి): చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు సొంత మండలం లో పోస్టింగ్‌ ఇవ్వరాదన్న నిబంధనను సడలించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జీవో నంబర్‌-5ను రద్దు చేయా లని, సచివాలయ ఉద్యోగుల నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంత రం తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.

అవుకు: ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన తరువాతే బదిలీలు చేపట్టాలని అవుకు గ్రామ సచివాలయ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎంపీడీవో వెంగన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు భీముడునాయక్‌, శిరోమణి, విజయలక్ష్మీ, దానమ్మ, రవి, నరసింహ, సుధీర్‌కుమార్‌, హేమల్‌నాయక్‌ పాల్గొన్నారు.

డోన టౌన: సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లోనే పోస్టింగులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ గ్రామ, వార్డు సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, కోశాధికారి నవీన అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో నరసింహులు, ఎంపీడీవో జి.వెంకటేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు భారతి, డిజిటల్‌ అసిస్టెంట్‌ మధు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పాండు పాల్గొన్నారు.

ఉయ్యాలవాడ: గ్రామ సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలోనే బదిలీకి అవకాశం ఇవ్వాలని ఆయా గ్రామాల సచివాలయ ఉద్యోగులు కోరారు. మంగళవారం మండల పరిషత కార్యాయలంలో ఎంపీడీవో ఉమామహేశ్వర్‌రావుకు వినతిపత్రం అందించారు.కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు మౌళాలి, జయరాముడు, కుమార్‌, జయసింహారెడ్డి, ఆశీర్వాదమ్మ, ప్రేమలత పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:15 AM