జలవనరుల శాఖలో బదిలీలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:41 AM
జలవనరుల శాఖ కర్నూలు జిల్లా సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్లలో పనిచేస్తున్న పరిపాలన విభాగపు సిబ్బందిని బదిలీలు చేస్తూ సోమవారం ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
కర్నూలు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జలవనరుల శాఖ కర్నూలు జిల్లా సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్లలో పనిచేస్తున్న పరిపాలన విభాగపు సిబ్బందిని బదిలీలు చేస్తూ సోమవారం ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఇరిగేషన్ కర్నూలు సర్కిల్ పరిధిలోని మైనర్ ఇరిగేషన్, టీబీపీ ఎల్లెల్సీ సబ్‌డివిజన్, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు డివిజన్, కేసీ కెనాల్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 70 మంది అటెండర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఏవోలను ఆయా సబ్ డివిజన్లకు బదిలీచేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సర్కిల్ పరిధిలో 70 మంది వివిధ డివిజన్లు, సబ్ డివిజన్లలో పనిచేస్తున్న పరిపాలన సిబ్బందిని ఇంత పెద్దఎత్తున బదిలీచేయడం ఇదే ప్రథమం. బదిలీ అయిన ఉద్యోగులకు బాలచంద్రా రెడ్డి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.