Share News

కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:34 AM

కానిస్టేబుళ్ల అభ్యర్థులకు తొమ్మిది నెలల పాటు శిక్షణ ఉంటుందని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ అన్నారు. ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో, డీటీసీ కేంద్రంలో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి

కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ
శిక్షణ పుస్తకం అందజేస్తున్న డీఐజీ

డీఐజీ కోయ ప్రవీణ్‌

కర్నూలు క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కానిస్టేబుళ్ల అభ్యర్థులకు తొమ్మిది నెలల పాటు శిక్షణ ఉంటుందని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ అన్నారు. ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో, డీటీసీ కేంద్రంలో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, బెటాలియన్‌ కమాండెంట్‌ దీపికా పాటిల్‌తో కలిసి డీఐజీ ఈ ప్రారంభించారు. డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు రక్షణగా ఇచ్చేలా అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని సమజంలో ప్రజలతో ఎలా మెలగాలి, సంఘ విద్రోహక శక్తుల పట్ల ఎలా వ్యవహరించాలి అన్న అంశాలను క్షుణ్ణంగా వివరిం చారు. వివిద జిల్లాల నుంచి 646 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఈశిక్షణా తరగతులో పాల్గొన్నారు. ఏపీఎస్పీ బెటాలి యన్‌లో ఉన్న 437 మందిని డీటీసీ కేంద్రానికి 209 మందిని కేటాయించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీ హుశేన్‌పీరా, బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ నాగేంద్రబాబు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 01:34 AM