శ్రీశైలం - దోర్నాల మధ్య నిలిపివేసిన రాకపోకలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:39 PM
శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్ల మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
శ్రీశైలం అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్ల మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. భారీవర్షాల కారణంగా తుమ్మలబైలు, చింతలగూడెం వద్ద వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో అధికారుల ఆదేశాల మేరకు అటవీశాఖ చెక్‌పోస్ట్‌లను మూసివేసి వాహనాల రాకపో కలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దోర్నాల, శిఖరేశ్వరం వద్ద ఉదయం 6 గంటలకు వాహనాలను పంపించనున్నారు. శ్రీశైలం వచ్చే యాత్రికులు గమనించుకోవాలన్నారు.