నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:50 AM
నగరంలోని ప్రధాన కూడళ్లలోని బస్సు స్టాప్‌లోనే బస్సులు నిలిపేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
కర్నూలు, న్యూసిటీ. డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రధాన కూడళ్లలోని బస్సు స్టాప్‌లోనే బస్సులు నిలిపేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. గురువారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘నగరం.. నరకం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. సి.క్యాంపు, కలెక్టరేట్ వద్ద ప్రైవేటు వాహనాలు నిలపకుండా పంపించి వేశారు. ఆర్టీసీ బస్సులు బస్‌స్టాపుల్లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించునేలా పర్యవేక్షించారు. అయితే ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని నిర్మించిన దుకాణాలను కూడా తొలగించాలని నగర పౌరులు, ప్రయాణికులు కోరుతున్నారు.