ఇన్ గేట్‌లో కష్టమే
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:02 AM
జీజీహెచ్‌లోనికి వచ్చే రోగులు ఆటోలతో ఇబ్బందిపడుతు న్నారు. ఇన్ గేట్ వద్ద నిత్యం ఇష్టారాజ్యంగా ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులు ఆక్రమించి ఉంటాయి.
108 అంబులెన్స్‌కు దారి ఇవ్వని ఆటోలు
పత్తాలేని ట్రాఫిక్ పోలీసులు, సెక్యూరిటీ
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జీజీహెచ్‌లోనికి వచ్చే రోగులు ఆటోలతో ఇబ్బందిపడుతు న్నారు. ఇన్ గేట్ వద్ద నిత్యం ఇష్టారాజ్యంగా ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులు ఆక్రమించి ఉంటాయి. దీంతో రోగులు లోనికి వెళ్లాలంటే చాలాసేపు నిలిచి ఉండాల్సి వస్తున్నది. ఆసుపత్రిలోనికి అంబులెన్స్ వెళ్లాలన్నా అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. మంగళవారం ఉదయం కర్నూలు జీజీహెచ్ ఇన్ గేట్‌లోనికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగితో 108 అంబులెన్స్ లోపలికి వెళ్లడానికి వచ్చింది. ఆ సమయంలో ఆటోలు, పండ్ల వ్యాపారులు అడ్డంగా ఆక్రమించుకోవడంతో అంబులెన్స్ లోపలికి వెళ్లలేకపోయింది. ఇన్‌గేటు వద్ద రెండు గేట్లలో ఒకటి మూసి, మరొకటి తెరిచి ఉంచడంతో ఇరుకుగా మారి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు, ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఇన్‌గేటు ముందు ఒక్కరూ లేరు. ట్రాఫిక్ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో అంబులెన్స్ రావడానికి చాలా సమయం పట్టింది. రోగి బంధువులు వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ అధికారులు ఇన్‌గేటు వద్ద ఉన్న రెండు గేట్లను తెరిచి ఉంచి ట్రాఫిక్‌ను, ఆటోలను నియంత్రించాలని రోగులు కోరుతున్నారు.