Share News

సర్కిల్‌లో సర్కస్‌

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:27 AM

నగర నడిబొడ్డున రాజ్‌విహార్‌ సర్కిల్‌లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆర్టీసీ డిపోను సిటీస్టాప్‌గా మార్చారు. బస్సులు ఇక్కడకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. స్టాప్‌లోకి వెళ్లే సమయంలో బస్సులు యూ టర్న్‌ తీసుకుని వెళ్లాలి.

సర్కిల్‌లో సర్కస్‌
నగరంలోని రాజవిహార్‌ వద్ద ప్రజల అవస్థలు

చోద్యం చూస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

కర్నూలు రాజవిహార్‌ సర్కిల్‌ వద్ద నిలచిన ఆటోలు

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగర నడిబొడ్డున రాజ్‌విహార్‌ సర్కిల్‌లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆర్టీసీ డిపోను సిటీస్టాప్‌గా మార్చారు. బస్సులు ఇక్కడకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. స్టాప్‌లోకి వెళ్లే సమయంలో బస్సులు యూ టర్న్‌ తీసుకుని వెళ్లాలి. ఈ మార్గం నుంచే ఆర్టీసీ బస్సులు వెళుతుంటాయి. డోన్‌, అనంతపురం బెంగుళూరు, నంద్యాల, కడప, తిరుపతి, చెన్నై, ఆత్మకూరు, శ్రీశైలం, ప్రకాశం, అమరావతికి వందల సఖ్యంలో బస్సులు వెళుతుంటాయి. అయితే ఆటోలు రోడ్డు అడ్డంగా నిపుతున్నారు, అలాగే కొందరు ఆర్టీసీ డ్రైవర్లు కూడా బస్సులను ఇస్టానుసారంగా రోడ్డుపైనే ఆపుతుండటంతో ప్రమాదాలకు గురవుతున్నామని వాహనచోదకులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అక్కడే రాజ్‌విహార్‌ సెంటర్‌లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పకైనా ఆర్టీసీ అధికారులు, పోలీసులు స్పందించి, ఆటోలను అక్కడ నిలపకుండా, చూడాలని బస్సులను సిటీ స్టాప్‌లోనే ఆపేలా చూడాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:27 AM