బస్సును ఢీ కొన్న ట్రాక్టర్
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:48 AM
జాతీయ రహదారి-44పై సోమవారం ఉదయం తిక్కతాత ఆలయం సమీపంలో ట్రాక్టర్ బస్సును ఢీ కొట్టి, డ్రైవర్ మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి

ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ఇద్దరికి గాయాలు
వెల్దుర్తి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి-44పై సోమవారం ఉదయం తిక్కతాత ఆలయం సమీపంలో ట్రాక్టర్ బస్సును ఢీ కొట్టి, డ్రైవర్ మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు.. కర్నూలు మండలం పసుపల నుంచి వెల్దుర్తికి ట్రాక్టర్, అనంతపురానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు పక్కపక్కనే వెళుతున్నాయి. ట్రాక్ట్రర్ డ్రైవర్ అకస్మాత్తుగా కుడివైపు తిప్పడంతో బస్సును ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజన్ నుంచి ట్రాలీ వేరై రోడ్డుపై బోల్తాపడింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ యశ్వంత్(23) అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్ సంజీవ(20), బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు హైవే పెట్రోలింగ్‌కు సమాచారం అందించ డంతో వారు చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో వెల్దుర్తి సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలను తొలగించారు.