Share News

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:09 AM

పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిని నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్‌

పావు కిలో బంగారం, కిలో వెండి స్వాధీనం

నంద్యాల టౌన్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిని నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నంద్యాల సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్‌ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిం చారు. శివశంకర్‌ అలియాస్‌ లడ్డు రాయవరం కోనసీమ జిల్లా, కోరాడ వెంటేశ్వరావు, బిక్కవోలు రాజమహేంద్రవరం జిల్లా ఇద్దరు కలసి పలుచోట్ల దొంగతనాలు చేసేవారు. వీరిద్దరిపై పశ్చిమగోదావరి జిల్లా రేవనూరు, గుంటూరు, హైదరాబాద్‌, రాజమహేంద్రవరం, విజయవాడ తదితర ప్రాంతాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో ఒకరిపై 20 కేసులు, మరోకరిపై 40 దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీరు ఉదయంపూట రెక్కీ నిర్వహిస్తూ ఇళ్లల్లో ఎవరూ లేని చూసి తాళాలు ధ్వంసం చేసి దొంగతనాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో నంద్యాల జరిగిన ఓ చోరీ కేసులో నిందితులపై కేసు నమోదైంది. నంద్యాల ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పాణ్య మండలంలోని సుగాలిమెట్ట వద్ద ఉండగా పోలీసులు అదుపు ోకి తీసుకున్నారు. వారి నుంచి పావుకిలో బంగారు, కిలో వెండి ఆభర ణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టులో కీలక పాత్ర పోషించిన పోలీసులను ప్రత్యేకంగా అభినందిచారు. ఈ సమావేశంలో సీసీఎస్‌ సీఐ సురేశ్‌కుమార్‌, పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, తాలుకా సీఐ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 01:09 AM