కర్నూలులో కుండపోత వాన
ABN , Publish Date - May 18 , 2025 | 12:49 AM
కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి మేఘావృతం కారణంగా చల్లదనం ఏర్పడింది.
మూడు గంటల పాటు కురిసిన వర్షం
కర్నూలు, మే 17 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి మేఘావృతం కారణంగా చల్లదనం ఏర్పడింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏకధాటిగా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్‌బీఐ సర్కిల్, కొండారెడ్డి బురుజు, ఎస్టీబీసీ కళాశాల, రాజ్‌విహార్, గుత్తిరోడ్డు, బస్టాండ్ ఎదురుగా, ఈద్గా సర్కిల్, గుత్తి రోడ్డు, నంద్యాల చెక్‌పోస్టు, బంగారుపేట తదితర కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.