చాగలమర్రిలో కుండపోత వర్షం
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:26 AM
మండలంలోని గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది.
తడిచిన మొక్కజొన్న ధాన్యం
13.2 మి.మీ వర్షపాతం నమోదు
చాగలమర్రి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. 13.2 మీ.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో ప్రభుత్వ కార్యాలయాలు, దేవాల యాలు, పాఠశాల ప్రాంగణాలు, ప్రధాన రహదారులు జలమయమ య్యాయి. గోపాయపల్లె రహదారిలోని అడ్డవాగు పొంగి ప్రవహించడంతో ఆయకట్టు రైతులు రాకపోకలు చేసేందుకు అవస్థలు పడ్డారు. చాగల మర్రి, శెట్టివీడు, ముత్యాలపాడు, గొడిగనూరు రహదారుల్లో ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం తడిచి దెబ్బతింది. వర్షానికి తడకుండా మొక్కజొన్న ధాన్యంపై కప్పిన పట్టాలలో వర్షపు నీరు నిలవడటంతో రైతులు ఆ నీటిని తొలగించుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు.
కొలిమిగుండ్ల: మండలంలోని వివిధ గ్రామాల్లో గడిచిన 24గంటల్లో 29.5మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ ఎం.శ్రీనివా సులు, ఏఎస్‌వో బాస్కరరెడ్డి శుక్రవారం వెల్లడించారు. కాగా మండలం లోని కొన్ని గ్రామాల్లో అధికంగానూ, మరికొన్ని గ్రామాల్లో స్వల్పంగానూ వర్షం కురిసినట్లు తెలిపారు.