Share News

కుండపోత వర్షం

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:21 PM

మండలంలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. 58 మి.మీ వర్షపాతం నమోదైంది.

కుండపోత వర్షం
నేలంపాడు గ్రామంలో ప్రవహిస్తున్న వరద నీరు

నేలంపాడు గ్రామం జలమయం

పొంగి పొర్లిన వాగులు, వంకలు

వెయ్యి ఎకరాల్లో నీట మునిగిన పొలాలు

ఇళ్లల్లోకి ప్రవేశించిన వరద నీళ్లు

స్తంభించిన రాకపోకలు

ఇబ్బందులు పడ్డ ప్రజలు

చాగలమర్రి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. 58 మి.మీ వర్షపాతం నమోదైంది. నేలంపాడు గ్రామం జలమ య మైంది. రాంపల్లె నుంచి నేలంపాడు గ్రామానికి రాకపోకలు స్తం భించాయి. జంగాలపల్లె, నేలంపాడు, గొట్లూరు, రాంపల్లె గ్రామాల సమీపంలోని పొలాలు నీట మునిగి చెరువులను తల పిస్తున్నాయి. మినుము, మొక్కజొన్న, కంది, వరి, జూట్‌ పం టలు దెబ్బతిన్నాయి. వరద భారీగా పొలాల్లో చేరడంతో రైతులకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. గ్రామంలో వరద నీరు ప్రవహిస్తుం టంతో పాఠశాలకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను వరద నీటిలోనే తీసుకెళ్లి వారి ఇళ్ల కు క్షేమంగా చేర్చారు. గోపాయపల్లె రహదారిలో గల అడ్డవాగు పొంగి ప్రవహించింది. చాగలమర్రి నుంచి ప్రొద్దుటూరుకు రాకపోకలు స్తంభించాయి. రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది 17వేల క్యూసెక్కులతో ప్రవహిం చింది. ముందస్తుగా ఆనకట్ట నుంచి కేసీ కాలువకు 450 క్యూసెక్కుల నీటిని తగ్గించామని ఏఈ జమాల్‌వలి తెలిపారు. ఆనకట్ట వద్దగల ఐదు గేట్లను ఎత్తి కడప జిల్లా వైపునకు వరదను విడుదల చేశారు. ముత్యాలపాడు, శెట్టివీడు, బ్రాహ్మణ పల్లె, మల్లేవేముల గ్రామాల సమీపంలో బెండ, మినుము, కం ది, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, వీఆర్వో ప్రసాద్‌రెడ్డి, టీడీపీ నాయకులు జనార్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద సహాయక చర్యలు చేపడుతామని, నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు.

Updated Date - Sep 18 , 2025 | 11:21 PM