Share News

టమోటా కొనుగోళ్లు ప్రారంభం

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:11 AM

పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ఆదివారం టమోటా కొనుగోల్లను ప్రారంభించారు.

టమోటా కొనుగోళ్లు ప్రారంభం

సీఎం ఆదేశాల మేరకు కిలో రూ.8ల ధర

పత్తికొండ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ఆదివారం టమోటా కొనుగోల్లను ప్రారంభించారు. నాలుగు రోజులుగా ధరలు పతనమవుతున్నాయని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గిట్టుబాటు ధర ప్రకారం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు మార్కెట్‌యార్డు కార్యదర్శి కార్నలిస్‌ సిబ్బందితో కలిసి టమోటా కొనుగోళ్లను ప్రారంభించారు. మార్కెట్‌కు 40 టన్నులు రాగా ఇప్పటికి 9 టన్నులను కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేసినట్టు తెలిపారు. రైతులు టమోటాను గ్రేడింగ్‌ చేసి తీసుకువచ్చి సహకరించాలని కోరారు. కాగా మార్కెట్‌ యార్డు అధికారులు కొనుగోళ్లను ప్రారంభించండంతో స్థానిక వ్యాపారులు రూటు మార్పి కిలోకు రూ.8ల పైగానే కొనుగోలు చేయడం గమనార్హం.

Updated Date - Sep 15 , 2025 | 12:12 AM