టమోటాకు తెగులు..రైతుకు దిగులు
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:06 AM
: ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో టమోటా పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు
వర్షం ప్రభావంతో కాయలకు మచ్చలు
కూలీలచే కాయలను పారవేస్తున్న రైతులు
తుగ్గలి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో టమోటా పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు. మండలంలో ఈ ఖరీఫ్‌లో దాదాపు 2వేల ఎకరాల్లో టమోటా సాగు చేశారు. మొదట్లో వర్షాలు కురువకపోవడంతో రైతులు నీళ్లు పోసి మొక్కలను నాటారు. ఎన్నో ఇబ్బందులు, వ్యవ ప్రయాసలకోర్చి పంటను కాపాడుకున్నారు. మొక్కలు బాగా పెరగడంలో మంచి దిగుబడి వస్తుందని, దర కూడా బాగా ఉండటంతో ఈ ఏడాది కలిసొస్తిందని ఆశపడ్డారు.
ముంచిన వర్షం
దిగుబడి వచ్చే సమయంలో 15 రోజుల పాటు వర్షాలు కురవడతో పంట దెబ్బతింది. టమోటా కాయలకు మచ్చ తెగులు సోకి కాయలు నాశనయ్యాయి. దీంతోపాటు చెట్టుకు కూడా తెగులు సోకడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మచ్చలు ఉన్న, కుళ్లిపోయిన టమోటాలను ఏరివేసేందుకు కూలీలను నియమించుకున్నారు. దీంతో పెట్టుబడి పెరగగా, కాయలకు మచ్చ రావడంతో వాటిని పొలంలోనే పారవేయాల్సి వస్తోందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు
రూ.1.10లక్షలతో సాగు చేశా
మూడున్నర ఎకరాల్లో దాదాపు రూ.1.10 లక్షలు ఖర్చుపెట్టి టమోటా సాగు చేశాను. మొక్కల కొనుగోలు, వాటిని బతికించుకోవడానికి వ్యయప్రయాసలకు గురయ్యారు. తీరా దిగుబడి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురి పంట కుల్లి పోయింది. చెడిపోయిన కాయలను తీసివేయడాని కూలీలకే రూ.5వేలు అయింది. - రఘు, జొన్నగిరి, తుగ్గలి మండలం.