Share News

రేపు కేఎంసీలో వైద్య విజ్ఞాన సదస్సు

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:20 AM

ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినం సందర్భంగా 10వ తేదీన కర్నూలు మెడికల్‌ కాలేజీ న్యూలెక్చరర్‌ గ్యాలరీలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎండోక్రైనాలజీ హెచ్‌వోడీ డా.పి.శ్రీనివాసులు వెల్లడించారు

రేపు కేఎంసీలో  వైద్య విజ్ఞాన సదస్సు
మాట్లాడుతున్న ఎండోక్రైనాలజీ హెచ్‌వోడీ డా.పి.శ్రీనివాసులు

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినం సందర్భంగా 10వ తేదీన కర్నూలు మెడికల్‌ కాలేజీ న్యూలెక్చరర్‌ గ్యాలరీలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎండోక్రైనాలజీ హెచ్‌వోడీ డా.పి.శ్రీనివాసులు వెల్లడించారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎండో క్రైనాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.పి.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.సయ్యద్‌ హలీంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎముకల ఆరోగ్యం డయాబెటిస్‌పై హైదరాబాద్‌ నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఎండోక్రైనాలజీ విభాగానికి చెందిన అడిషినల్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌ డా.బీట్రైస్‌ అంశంపై ఎముకల ఆరోగ్యం, డయాబెటిస్‌ పై ఉపన్యసిస్తాన్నారు. బాధితులకు ఎముకలు బలహీనంగా ఉంటాయని, సుగర్‌ను అదుపులో ఉంచుకోవాలన్నారు. జీజీహెచ్‌ ఎండోక్రైనాలజీ విభాగం న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో డెక్సాస్కాన్‌ అందుబాటులో ఉందని, ఈస్కాన్‌ అస్టియోపోరాసిస్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చునన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 12:20 AM