Share News

నేడు మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:28 AM

నేడు మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు మంజూరు చేసింది. దీంతో బుధవారం పాఠశాలలను ముస్తాబు చేశారు.

నేడు మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం
ఆదోనిలో అలంకరణ సామగ్రి సిద్ధం చేస్తున్న విద్యార్థినులు

పాఠశాలలు ముస్తాబు చేసిన విద్యార్థులు

ఏర్పాట్లు పూర్తి చేసిన హెచ్‌ఎంలు, ఉపాఽధ్యాయులు

ఆదోని అగ్రికల్చర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నేడు మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు మంజూరు చేసింది. దీంతో బుధవారం పాఠశాలలను ముస్తాబు చేశారు. ఉపాధ్యాయులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు ఆహ్వాన పత్రికలను తయారు చేసి, ముఖ్య అతిథులకు అందజేశారనను. ఆదోని నెయోజకవర్గంలో 139 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. ఇందులో 40 వేల మందిపైగా విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. ప్రభుత్వం బడి తెరిచిన రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాకిట్లను అందించింది. మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యాన్ని పంపిణీ చేసింది.

పాఠశాలలు ముస్తాబు

పాఠశాలలను విద్యార్థులు రంగురంగుల పేపర్లతో అలంకరించారు. దీంతో తరగతి గదులు ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తున్నారు. విద్యార్థులే స్వయంగా ఆహ్వాన పత్రికలు, బ్యాడ్జిలు తయారు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు కూడా అందించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాము

మెగా పేరెంట్స్‌ టీచర్‌ సమావేశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బుధవారం పండుగలా నిర్వహించాలని పాఠశాలల్లో ఏర్పాటు పూర్తి చేశాము. విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులతో పాఠశాలలు కళకళలాడుతాయి. సమావేశంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. - భూపాల్‌ రెడ్డి, ఎంఈవో-1, ఆదోని

Updated Date - Jul 10 , 2025 | 01:28 AM