నేడు రైతుల పండుగ
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:41 PM
రైతులకు పండుగొచ్చింది. బుధవారం 2,72,757 మంది అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు రూ.5వేల ప్రకారం రూ.136.38 కోట్లు, కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతుకు రూ.2వేల ప్రకారం ఈ సంవత్సరం రెండో విడతగా రూ.45.12 కోట్లు మొత్తం రెండు పథకాల కింద రూ.181.36 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కానున్నట్లు కలెక్టర్ సిరి తెలిపారు.
అన్నదాత సుఖీభవ కింద రూ.136.38 కోట్లు
పీఎం కిసాన్ ద్వారా రూ.45.12 కోట్లు
మొత్తం రూ.181.36 కోట్లు
2.72 లక్షల మంది రైతుల ఖాతాలకు జమ
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు పండుగొచ్చింది. బుధవారం 2,72,757 మంది అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు రూ.5వేల ప్రకారం రూ.136.38 కోట్లు, కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతుకు రూ.2వేల ప్రకారం ఈ సంవత్సరం రెండో విడతగా రూ.45.12 కోట్లు మొత్తం రెండు పథకాల కింద రూ.181.36 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కానున్నట్లు కలెక్టర్ సిరి తెలిపారు. మంగళవారం ఆమె టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కర్నూలు అర్బన్‌లో 295 మంది రైతులకు రూ.15 లక్షలు, అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్ కింద రూ.3లక్షలు మొత్తం రూ.18 లక్షలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో 35,000,52 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.17.526 కోట్లు, పీఎం కిసాన్ ద్వారా రూ.5.48 కోట్లు మొత్తం రూ.23 కోట్లు రైతులకు అంద జేయనున్నట్లు తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 38,318 మంది రైతులకు అన్నదాత కింద రూ.19.159 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.6.881 కోట్లు జమ కానున్నాయి. ఆదోని నియోజకవర్గంలో 18,722 మంది రైతులకు అన్నదాత పథకం కింద రూ.9.36 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.2.96 కోట్లు మొత్తం రూ.12.32 కోట్లు. మంత్రాలయం నియోజకవర్గంలో 41,992 మంది రైతులకు అన్నదాత పథకం కింద రూ.20,996 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద రూ.6.62 కోట్లు మొత్తం రూ.27.616 కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. పత్తికొండ నియోజకవర్గంలో 54,774 మంది రైతులకు రూ.27.387కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.9.79కోట్లు మొత్తం రూ.37.177కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు పడుతాయన్నారు. ఆలూరు నియోజక వర్గంలో 63,317 మంది రైతులకు రూ.31.6585 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.10.43 కోట్లు మొత్తం రూ.42.0885 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుతాయన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో .20,287 మంది రైతులకు అన్నదాత పథకం కింద రూ.10.1435 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.3.22 కోట్లు మొత్తం రూ.13.3635 కోట్లు జమ చేశామన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందిన డబ్బులకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిరి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆర్డీవోలు, వ్యవసాయశాఖ ఏడీలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ హార్టికల్చర్ అదికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో కలెక్టర్ ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు.