హామీలకే పరిమితమైన పొగాకు కొనుగోళ్లు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:46 AM
మూడు నెలల నుంచి పొగాకు కొనుగోలు చేస్తా మని కంపెనీదారులు చెబుతున్న మాటలు హామీ లకే పరిమితమయ్యాయని పొగాకు రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.
పొగాకు కంపెనీ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా
కర్నూలు రూరల్ జూన 9(ఆంధ్రజ్యోతి): మూడు నెలల నుంచి పొగాకు కొనుగోలు చేస్తా మని కంపెనీదారులు చెబుతున్న మాటలు హామీ లకే పరిమితమయ్యాయని పొగాకు రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగర శివారు లోని గార్గేయ పురం చెరువు సమీపంలో ఉన్న జీపీఐ, ఐటీసీ, వీఎస్‌టీ, బొమ్మిడి పొగా కు కంపెనీ కార్యాలయాల ఎదుట సోమ వారం ఉల్చాల, రేమట గ్రామాల రైతులు వారు పండించిన పొగాకును చేత పట్టుకొని ధర్నా చేశారు. ఈసందర్భంగా రైతులు లక్ష్మన్న, రాముడు, బజారన్న మాట్లాడుతూ సిరి కంపెనీ ఒప్పందంతో ఉల్చాలలో దాదా పు వంద ఎకరాల్లో సిరి పొగాకు పంట పం డించామన్నారు. నెలల నుంచి పొగాకు కంపెనీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకో వడం లేదన్నారు. కలెక్టరేట్‌లో జరుగు తున్న స్పందన కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికా రులకు రైతులు వినతిపత్రం సమర్పించారు. ఈధర్నాలో రైతులు బుర్రపెద్దకర్రెన్న, చిన్నమాధన్న, లక్ష్మన్న, రంగస్వామి, లక్ష్మన్న పాల్గొన్నారు.