పొగాకు రైతులను ఆదుకోవాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:54 PM
జిల్లాలోని పొగాకు రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.
కలెక్టర్‌కు రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకుల వినతి
నంద్యాల నూనెపల్లె/ మున్సిపాలిటీ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పొగాకు రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ రాజకుమారిని సాధన సమితి నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పంట కొనుగోలుపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పొగాకు రైతుల కష్టాలను, ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, పొగాకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు అమరేంద్రారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చిన్నగోకారి, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.