Share News

ఎవరికోసం ఈ భవనాలు?

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:12 AM

మండలంలోని నేలతల మర్రి, దేవనకొండ, గ్రామాల్లో సచివాల భవనాలు పూర్తికాలేదు. 90శాతం పనులు చేసిన అనంతరం అలాగే వదిలేయడంతో అసాంఘిక కార్యక్రమాలుకు అడ్డాగా మారాయి.

ఎవరికోసం ఈ భవనాలు?
నేలతలమర్రిలో సచివాలయ, ఆరోగ్య కేంద్రం

నిలిచిపోయిన నిర్మాణాలు

దేవనకొండ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నేలతల మర్రి, దేవనకొండ, గ్రామాల్లో సచివాల భవనాలు పూర్తికాలేదు. 90శాతం పనులు చేసిన అనంతరం అలాగే వదిలేయడంతో అసాంఘిక కార్యక్రమాలుకు అడ్డాగా మారాయి. రైతుసేవా కేంద్రాల భవనాలది కూడా అదే పరిస్థితి. ఒక్కో భవనానికి రూ.23.94 లక్షలు మంజూర య్యాయి. నిర్మాణాలు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. మండలంలో 20 రైతు సేవా కేంద్రాలకు గాను 8 పూర్తై, 12 భవనాల నిర్మాణాలు ఆగిపోయాయి. ఆరోగ్య కేంద్రాలదీ అదే దుస్థితి. దేవన కొండ మినహా మిగతా 18 చోట్ల భవనాలు నిర్మించాల్సి ఉండగా 3 ఆరోగ్య కేంద్రాలు మాత్రమే పూర్తయ్యాయి. అధికారులు స్పందించి భవన నిర్మాణాలను పూర్తిచేసి ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతు న్నారు.

భవనాలను పూర్తిచేస్తాం

మండలంలో పెండింగ్‌ వున్న భవనాలను పూర్తి చేస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాటిని ఉపయో గంలోకి తెస్తాం. - వెంకటప్పనాయుడు, ఇన్‌చార్జి పీఆర్‌ ఏఈ, దేవనకొండ.

Updated Date - Jun 22 , 2025 | 12:12 AM