Share News

పంటలను కాపాడుకునేందుకు..

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:55 PM

మండలంలోని మద్దికెర, బురుజుల, పెరవలి, ఎం.అగ్రహారం, బీఎన్‌ పేట, ఎడవలి, బొమ్మన పల్లి, కొత్తపల్లి, హంపా, రాంపురం గ్రామాల రైతులు హంద్రీనీవా కాలువను నమ్ముకుని 10వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు.

పంటలను కాపాడుకునేందుకు..
కాలువలో ఇసుక మూటలు వేసిన రైతులు.. మోటర్ల ద్వారా పొలాలకు నీటి సరఫరా

హంద్రీనీవాకు నిలిచిన నీటి సరఫరా ఫ ఇసుక మూటలు వేసి ఆఖరు బొట్టును వాడుకుంటున్న రైతులు

మద్దికెర, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దికెర, బురుజుల, పెరవలి, ఎం.అగ్రహారం, బీఎన్‌ పేట, ఎడవలి, బొమ్మన పల్లి, కొత్తపల్లి, హంపా, రాంపురం గ్రామాల రైతులు హంద్రీనీవా కాలువను నమ్ముకుని 10వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. ఈ ఏడాది వేరుశనగ, మినుము, పచ్చిమిరప వేశారు. ప్రతి ఏడాది మే రెండో వారం వరకు హంద్రీనీవా నీరు సరఫరా అయ్యేది. అయితే ఈ ఏడాది మార్చి 10వ తేదీకే నీటి సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి.

ఇసుక మూటలు వేసి..

హంద్రీనీవా కాలువలో ఉన్న కాస్త నీటిని ఉపయోగించుకునేందుకు రైతులు ఇసుకమూటలను అడ్డంగా వేసి, ఆ నీటిని వాడుకుంటున్నారు. అంతేగాక బురుజుల పంచాయతీ వారు కూడా ఈ హంద్రీనీవా నీటినే నిల్వ చేసి, తాగునీరు అందిస్తారు. అయితే ఈ ఏడాది ఉన్న ఫలంగా నీరు నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి, తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది పడే ప్రమాదముంది.

Updated Date - Mar 16 , 2025 | 11:55 PM