అలజడులు సృష్టించేందుకే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:36 AM
గుడివాడలో సభ పేరుతో కులాల మధ్య అలజడులు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారని డీసీఎంఎస్ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్ ధ్వజమెత్తారు.
పెర్ని నానీ.. నోరు అదుపులో పెట్టుకో
డీసీఎంఎస్ చైర్మన నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు అర్బన, జూలై 14(ఆంధ్రజ్యోతి): గుడివాడలో సభ పేరుతో కులాల మధ్య అలజడులు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారని డీసీఎంఎస్ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్ ధ్వజమెత్తారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో మాదిగ కార్పొరేషన డైరెక్టర్ ధరూర్ జేమ్స్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశలపై వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పెలితే తగిని బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ సీఎం జగన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రావా లంటే భయ పడేలా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, పెర్నినాని పామర్రు సభలో చీకట్లో కన్నుకోడితే నరికేయాలని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. పెర్నినానీ నోరు అదుపులో పెట్టుకో వాలని హితవు పలికారు. ఈసమావేశంలో నాయకులు మంచాలకట్ట భాస్కర్‌రెడ్డి, ఆదాం పాల్గొన్నారు