Share News

భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా నిలవాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:42 PM

విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గదర్శ కులుగా నిలవాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా నిలవాలి
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మార్గదర్శ కులుగా నిలవాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. నంద్యాల శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన గణిత విజ్ఞానమేళా, సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. మన వేదాలు, పురాణాలు మనిషి నడవడికను తీర్చిదిద్దాయన్నారు. విద్య కేవలం మార్కులు సాఽధించడానికే కాకుండా ఉన్నత విలువలను పెంపొందించడానికి ఉపయోగపడాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ విలువలను కలిపి బోధించడానికి విద్యాభారతి వంటి సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు. పాఠశాల కమిటీ సభ్యులు కలెక్టర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రెడ్డి, సరస్వతీ విద్యాపీఠం సమితి అధ్యక్షుడు డాక్టర్‌ జి.రామకృష్ణారెడ్డి, ఎన్‌ఎండీ ఫయాజ్‌, విద్యాభారతి కార్యదర్శి ప్రతాప్‌సింహశాస్ర్తి, సంఘటన కార్యదర్శి కన్నాభాస్కర్‌, పాఠశాల మేనేజర్‌ వసుంధరాదేవి, ప్రధానోపాధ్యాయులు వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:42 PM