Share News

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:25 AM

కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందగా.. నలుగురు గాయప డ్డారు.

 పిడుగుపాటుకు ముగ్గురి మృతి
ఈరన్న (ఫైల్‌)

నలుగురికి గాయాలు

కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల ఘటనలు

ఎమ్మిగనూరు రూరల్‌/పెద్దకడుబూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందగా.. నలుగురు గాయప డ్డారు. వివరాలివీ.. పెద్దకడుబూరు మండలంలోని హనుమా పురం గ్రామానికి చెందిన గొల్ల కొత్తూరు ఈరన్న(28) భార్య గర్భిణి. సోమవారం తన భార్య ప్రసవం అవుతుందని వైద్యులు తెలపడంతో ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్లు కొండలో వెలసిన సుశీలమ్మకు పూజ చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళ్లాడు. పూజ ముగించుకొని వస్తుండగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మార్గమధ్యలో వారు నడుచుకుంటూ వస్తుం డగా పిడుగు పడడంతో ఈరన్న అక్కడిక్కడే మృతి చెందాడు. ఈరన్నతో పాటు ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుడికల్లు సమీపంలో..

ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్లు సమీపంలో పెద్దకడుబూరు మండలం హెచ్‌. మురవణి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అడివన్న(50) పిడుగుపాటుతో మృతి చెందారు. పనినిమిత్తం పట్టణ సమీపంలో ఉన్న హేమంత్‌ వైన్స్‌ దగ్గరకు వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎమ్మిగనూరు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిప్పగిరిలో పిడుగు పడి వ్యక్తి మృతి

చిప్పగిరి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): చిప్పగిరిలోని ఉల్లిగమ్మ దేవాలయం వెనక పిడుగు పడటంతో శివన్న అనే రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి మృతి చెందారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పశువులకు మేతవేయడానికి వెళ్లిన శివన్న పశువులపాకలో ఉన్నారు. అదె సమయంలో పిడుగు చెట్టుపై పడడంతో చెట్టుకొమ్ము విరగిపోయింది. చెట్టు శివన్నపై పడడంతో ఇక్కడ అక్కడే మృతి చెందాలని స్థానికులు తెలిపారు. శివన్నకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:25 AM