20 నెలల్లో ముగ్గురు సీఐలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:13 PM
గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌పై పోలీసు ఉన్నతాధికారులకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు కాని ఇక్కడికి వచ్చిన సీఐలు ఆరు, ఏడుమాసాలు ముగి యక ముందే బదిలీపై వెళుతున్నారు.
గోనెగండ్ల పోలీసు స్టేషన్‌లో బదిలీలు
రాజకీయ జోక్యమా?... యాదృశ్చికమా?
గోనెగండ్ల, నవంబరు 15(ఆంఽధ్రజ్యోతి): గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌పై పోలీసు ఉన్నతాధికారులకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు కాని ఇక్కడికి వచ్చిన సీఐలు ఆరు, ఏడుమాసాలు ముగి యక ముందే బదిలీపై వెళుతున్నారు. 20మాసాల్లో ముగ్గురు సీఐలు మా రారు. ఒకరు ఆరు మాసాల రెండు రోజలు, మరొకరు ఏడు మాసా ల ఆరు రోజులు, ఇంకొకరు ఎనిమిది మాసాలు విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్నారు. ఫిబ్రవరి 2024కంటే ముందు గోనెగండ్ల స్టేషన్‌కు ఎస్‌ఐ మాత్రమే హౌస్ ఆఫీసర్‌గా ఉండేవారు. ఎస్‌ఐలు ఉ న్నంత కాలం ఏడాదిన్నర, లేక రెండేళ్లు విధులు నిర్వహించి బదిలీపై వెళ్లేవారు. అజిల్లాలో కొన్ని పోలీస్‌స్టేషన్లు అప్‌గ్రేడ్ కావటంలో భా గంగా గోనెగండ్లకు సీఐ పోస్టు వచ్చింది. 5.02.2024న రామ కృష్ణ య్య సీఐగా బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. రామకృష్ణయ్య 07.08.2024న బదిలీపై వెళ్లిపోయారు. తర్వాత గంగాధర్ సీఐగా 07.08.2024 బా ధ్యతలు చేపట్టారు. 13.03.2025న ఆస్పరికి బదిలీ అయ్యారు. 13.03. 2025న విజయభాస్కర్ సీఐగా బాధ్యతలు చేపట్టి, 13.11.2025 న ఏసీబీకి వెళ్లిపోయారు. సీఐల బదిలీలు రాజకీయ జోక్యంతో జరుగు తున్నాయా? లేక యాదృశ్చికంగా జరుగుతున్నాయా? అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం గోనెగండ్ల సీఐగా ఎమ్మిగ నూరు రూరల్ సీఐని ఇన్‌చార్జిగా ఉన్నతాధికారులు నియమించారు.