Share News

హత్య కేసులో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:47 AM

మండలంలోని ప్యాలకుర్తి సమీపంలో అక్టోబరు 28న జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తబ్రేజ్‌ చెప్పారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

హత్య కేసులో ముగ్గురి అరెస్టు
నిందితులను చూపుతున్న సీఐ తబ్రేజ్‌

కోడుమూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్యాలకుర్తి సమీపంలో అక్టోబరు 28న జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తబ్రేజ్‌ చెప్పారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేవనకొండ మండలం పి. కోటకొండకి చెందిన దస్తగిరి ఆచారికి, చెల్లెలచెలిమకి చెందిన వరలక్ష్మితో 16ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. పెళ్లి అయినప్పటి నుంచి కాపురంలో కలహాలు జరిగేవి. దస్తగిరి ఆచారి నిత్యం భార్యపై అనుమానం వ్యక్తం చేసేవారు. పెద్దల సమక్షంలో పంచాయితీ, దేవనకొండ పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లింది. రెండేళ్ల క్రితం ఇరువురు విడిపోయారు. వరలక్ష్మి కర్నూలు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తుంది. పిల్లల కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు భర్తను హత్య చేయాలని భార్య నిర్ణయించుకుంది. హత్యకు తన సోదరులైన శేఖర్‌, వీరేశ్‌తో కలిసి కుట్ర పన్నింది. అక్టోబరు 28న పి.కోటకొండకు వెళ్లాలని ఒక ఆటోలో దస్తగిరి ఆచారి, వరలక్ష్మి, శేఖర్‌, వీరేశ్‌ కలిసి బయలుదేరారు. ప్యాలకుర్తి గ్రామం సమీపంలో తాగిన మైకంలో ఉన్న దస్తగిరి ఆచారి గొంతుకు టవల్‌ బిగించి హత్య చేశారు. పత్తికొండ రహదారిలోని పెట్రోల్‌బంకు దగ్గర అనుమానంగా ఒక ఆటోలో ముగ్గురు నిందితులు తిరుగుతుండగా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి మందు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ డివై స్వామి, ట్రైనింగ్‌ ఎస్‌ఐ మణికంఠ, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:47 AM