Share News

ఇదో రకమైన మోసం..

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:10 AM

కంప్యూటర్‌ కాలంలో రోజుకో మోసం వెలుగు చూస్తునే ఉంది..ఓ వైపు చదువ ుకున్న వాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతుంటే.. మరో వైపు చదువులేని వాళ్లు కూడా వారి తరహాలోనే మోసాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో అమాయక జనం వీరిలాంటి మాటలు విని నిట్టనిలువునా మునిగిపోతున్నారు. మాయ మాటలు చెప్పి వ్యాపారం పేరుతో జనాన్ని మోసం చేసిన సంఘటన పెద్దకడబూరు మండలంలో వెలుగు చూసింది.

ఇదో రకమైన మోసం..
పెద్దకడబూరులో నిందితులను చూపుతున్న డీఎస్పీ భార్గవి

ఛేదించిన పెద్దకడబూరు ఎస్‌ఐ

జేసీబీల కొనుగోలు, అమ్మకాలతో అక్రమాలకు పాల్పడిన నిందితులు

పెద్దకడబూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కంప్యూటర్‌ కాలంలో రోజుకో మోసం వెలుగు చూస్తునే ఉంది..ఓ వైపు చదువ ుకున్న వాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతుంటే.. మరో వైపు చదువులేని వాళ్లు కూడా వారి తరహాలోనే మోసాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో అమాయక జనం వీరిలాంటి మాటలు విని నిట్టనిలువునా మునిగిపోతున్నారు. మాయ మాటలు చెప్పి వ్యాపారం పేరుతో జనాన్ని మోసం చేసిన సంఘటన పెద్దకడబూరు మండలంలో వెలుగు చూసింది. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సీఐ మంజునాథ్‌లు తెలిపిన వివరాల మేరకు పెద్దకడబూ రుకు చెందిన చింతకుంట నీలయ్య మొదటగా ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగించేవాడన్నారు. కాలక్రమేన జేసీబీలను కొనుగోలు చేసి విక్రయించేవాడు. అయితే కొన్ని రోజులకు జేసీబీల విక్రయ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆదోని పట్టణానికి చెందిన భార్గవ్‌ రాముడితో పరిచయం ఏర్పడింది. భార్గవ్‌ రాముడు జేసీబీలు విక్రయించే డీలర్స్‌ వాట్సప్‌ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. ఎవరైనా జేసీబీలకు విక్రయిస్తామని గ్రూపులో పోస్టు పెడితే ఈ సమాచారాన్ని చింతకుంట నీలయ్యకు సమాచారం తెలిపేవాడు. ఈ సమాచారంతో నీలయ్య కంటీన్యూ ఫైనాన్స్‌ కింద జేసీబీలు కొనుగోలు చేసి కంతుల రూపంలో నగదు కట్టే విధంగా కంపెనీతో మాట్లాడుకొని తాను కొన్ను జేసీబీకి రెండు లేదా మూడు నెలల వరకు కంతులు సక్రమంగా చెల్లించేవాడు. అటు తర్వాత మరొకరికి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. అమ్మిన వారికి జేసిబీ బండి కంతులు అన్ని కట్టి ఫైన్స్‌ క్లియర్‌ చేసి వారి పేరుపై చేయిస్తానని చెప్పి జేసిబిని అప్పగించి వాచ్చేవాడు. ఈ క్రమంలో కొన్ని జేసీబీలను నీలయ్య, భార్గవ్‌రాముడులకు అందజేయడానికి కొటిపల్లి గ్రామానికి చెందిన అమల్తూర్‌ రాజు అలియాస్‌ బాపట్ల రాజు ఏజెంట్‌గా వ్యవహరించేవాడు. ఇలా తీసుకున్న కొన్ని జేసీబీలను బళ్లారికి చెందిన షఫిసాబ్‌హల్గి ఏజెంట్‌గా ఉండి అమ్మించేవాడు. ఇలా వచ్చిన నగదును అందరు పంచుకు నేవారు. మిగిలిన డబ్బులతో వారు తీసుకున్న జేసీబీలకు కొన్ని కంతుల రూపంలో చెల్లించేవారన్నారు. ఈ క్రమంలో డోన్‌కు చెందిన లత వద్ద కంటీన్యూ ఫైనాన్స్‌ కింద తీసుకున్న బండిని పెద్దకడబూరు గ్రామానికి చెందిన జింకనాగరాజుతో కలిసి ఆదోనికి చెందిన గుమట మహబూబ్‌ బాషాలతో జేసిబీ ఛాసిస్‌ నెంబర్‌ మీద జింక నాగరాజు జేసీబీ ఛాస్‌ నెంబర్‌ ప్రింటు వేయించి లత బండిని కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలుకా కుర్డి గ్రామానికి చెందిన మహమ్మద్‌ నెహాల్‌ గౌస్‌కు విక్రయించారు. ఈ జేసీబీ యజమాని లత జీపీఎస్‌ ఆధారంగా తన జేసీబీ వాహనాన్ని ఎక్కడుందో గుర్తించుకుంది. జేసీబీలు అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా సుమారు రూ.63.10లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలో హిందూ పురంకు చెందిన నిర్మలాబాయి జేసీబీని నీలయ్య, భార్గవ్‌రాముడు, జింక నాగరాజులు కొనుగోలు చేసి జేసీబీకి ఉన్న కంతులు కట్టకపోవడంతో కంపెనీ వారు నిర్మలాబాయిని జేసీబీ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో నిర్మలాబాయి తాను తన జేసీబీని నీలయ్య, భార్గవ్‌ రాముడు, జింక నాగరాలకు విక్రయిం చానని తన బండికి సంబందించిన పూర్తి నగదును కట్టకుండ కాల యాపన చేస్తూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సెప్టెంబర్‌ 14న పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డికి లికిత పూర్వకంగా ఫిర్యాదు చేసిందన్నారు. ఈ కేసును ఛాలెంజింగ్‌ గా తీసుకున్న ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి జేసీబీల క్రయ, విక్రయాల్లో ఉన్న మోసాన్ని గుట్టు రట్టు చేశారు. నీలయ్య, భార్గవ్‌రాముడు కొన్న 8 జేసీబీలను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. స్వాదీనం చేసుకున్న 8 జేసీబీలను సంబందిత యజమానులకు కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుం దన్నారు. కేసు చేధించిన ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి, ఏఎస్‌ఐ ఆనంద్‌, శివరాములు, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - Dec 02 , 2025 | 01:10 AM