Share News

ఈక్రాప్‌ నమోదు తప్పనిసరిగా చేయాలి

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:52 PM

ప్రతి పంటకు ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్‌ ఏ.సిరి వ్యవసాయాధికారులను ఆదేశించారు.

ఈక్రాప్‌ నమోదు తప్పనిసరిగా  చేయాలి
పంచలింగాలలో పంట ఈక్రాప్‌ నమోదును పరిశీలిస్తున్న కలెక్టర్‌

కర్నూలు రూరల్‌, నవంబరు1(ఆంధ్రజ్యోతి): ప్రతి పంటకు ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్‌ ఏ.సిరి వ్యవసాయాధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని పంచలింగాల గ్రామంలో ఈ క్రాప్‌ నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించి రైతులతో మాట్లాడారు. రికార్డులో నమోదైన పంటలు వాస్తవంగా పొలాల్లో సాగుచేయబడుతున్నాయా లేదా అని కలెక్టర్‌ తెలుసుకున్నారు. పుల్లయ్య అనే రైతు వేసిన ఉల్లిపంటను కలెక్టర్‌ పరిశీలించారు. పత్తి రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న కోత వివరాలను తెలుసుకున్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ, అసిస్టెంట్‌ అధికారి సాలురెడ్డి, ఏవో రూఫస్‌, తహసీల్దార్‌ రమే్‌షబాబు పాల్గొన్నారు

Updated Date - Nov 01 , 2025 | 11:53 PM