Share News

పక్కాగా ఈక్రాప్‌

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:45 PM

ప్రస్తుత రబీలో రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట వివరాలు ఈక్రాప్‌లో నమోదు చేయాలని, ఎలాంటి లోపాలు జరగకూడదని కలెక్టర్‌ ఏ. సిరి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.

పక్కాగా ఈక్రాప్‌

లోపాలు తలెత్తితే బాధ్యత మీదే

పంటలపై తెగుళ్లను నివారించండి

క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి

రైతులకు అండగా ఉండండి: కలెక్టర్‌ సిరి

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రబీలో రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట వివరాలు ఈక్రాప్‌లో నమోదు చేయాలని, ఎలాంటి లోపాలు జరగకూడదని కలెక్టర్‌ ఏ. సిరి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో పై విభాగాలకు చెందిన అధికారులతో పంటలకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా పంటల్లో వ్యాపిస్తున్న తెగుళ్లు, క్రిమికీటకాలను నివా రించి రైతులను నష్టాల నుంచి గట్టెక్కించాలని ఆదేశించారు. వ్యవ సాయ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని సూచించారు. ఉల్లి పంట వివరాలను సర్వే నెంబర్‌ వారీగా రైతుల ప్రకారం వివరాలు ఇవ్వాలన్నారు. సెప్టెంబరు మొదటి వారం నుంచి ఇప్పటి దాకా ప్రతి వారం ఎంత మేరకు క్రాప్‌ బుకింగ్‌ చేశారనే వివరాలను సర్టిఫై చేసి తనకు అందిం చాలని కలెక్టర్‌ ఉద్యాన శాఖ అధికారి రాజావర్దన్‌ రెడ్డిని ఆదేశించారు. మిరప పంటలో ముడత వ్యాధి వ్యాపిస్తోందని, తక్షణమే గ్రామాల్లో పర్యటించి నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పత్తి రైతుల వివరాలు సీఎం యాప్‌లో, కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసేందుకు రైతులకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది అండగా ఉండాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:45 PM