పల్లెల్లో దాహం కేకలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:59 PM
గ్రామాల్లో ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఆస్పరి, దేవనకొండ మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి
ఆస్పరి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని చిరుమాన్ దొడ్డి, చిగిలి, నగరూరు, తంగరుడోన, యాటకల్లు, కల్లపరి, ఐనేకల్, కైరుపుల, పుప్పాల దొడ్డి గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్ , గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. నాగనాథన హళ్లి రిజర్వాయర్ నుంచి తాగునీరు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి, తాగునీటి పథకాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని కోరుతున్నారు.
పుల్లాపురంలో తాగునీటి ఎద్దడి
దేవనకొండ: మండలంలోని పుల్లాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామం చుట్టూ 15కి పైగా చేతి పంపులు, బోర్లు ఉన్నా అవి పనిచేయడం లేదు. గతంలో గ్రామానికి సూమారు 4 కిలో మీటర్ల దూరంలో బోరు వేసి నీరందించారు. వేసవి కావడంతో భూగర్భ జలాలు ఇంకిపోయి అదికుడా సక్రమంగా పని చేయడం లేదు. దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుడుతున్నామని, పరిష్కరించాలని కోరుతున్నారు.