Share News

మత సామరస్యం కలిగి ఉండాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:15 AM

పండుగలను శాంతియుతంగా చేసుకుని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ సూచించారు. సోమవారం ఆదోనిలోని మున్సిపల్‌ సమావేశ భవనంలో అధికారులు, మత పెద్దలతో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

మత సామరస్యం కలిగి ఉండాలి
మాట్లాడుతున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఆదోనిలో సమావేశం

ఆదోని, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పండుగలను శాంతియుతంగా చేసుకుని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ సూచించారు. సోమవారం ఆదోనిలోని మున్సిపల్‌ సమావేశ భవనంలో అధికారులు, మత పెద్దలతో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ, సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ పాల్గొన్నారు. 27న విగ్రహాలను ప్రతిష్ఠిం చిన అనంతరం నిర్వాహకులు పోలీసులు నిర్ణయించిన నియమాలను పాటించాలని కోరారు. డీజే సౌండ్‌ పరిమితికి మించి పెట్టవద్దని, గొడవలకు తావు లేకుండా శోభాయ్రాత నిర్వహించుకోవాలన్నారు. పోలీసులకు మండపాల నిర్వాహకులు అందుబాటులో ఉండాలని, సెల్‌ఫోన్‌ నంబర్లు ఉండాలన్నారు. 31న ఉదయం 10 గంటల నుంచే నిమజ్జనాన్ని ప్రారంభించి, రాత్రి 10 గంటల్లోగా ముగించాలన్నారు. అధికారులంతా తమ విధులను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. ఏఎస్పీ హుసేన్‌పీరా, డీఎస్పీ హేమలత, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ సావిత్రి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లోకేశ్వరి, సభ్యులు విట్టా రమేష్‌, బసవన్నగౌడ్‌, కునిగిరి నీలకంఠ, ప్రతాప్‌, దేవిశెట్టి ప్రకాష్‌, జమీల్‌షఫీ ఉన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 01:15 AM